పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూకతతో రాత్రింబగళ్లు కష్టపడి, పేరు నిల బెట్టుటకు బెంజమిను ప్రయత్నించుచుండెను.

ఇతను మొదటినుండి, వార్తాపత్రికను ముద్రించి ప్రచురము చేయవలె ననికోరుచుండెను. చేయబూనినపని నాచరణలోనికి తెచ్చువఱకు దానిని గోప్యముగ నుంచు స్వభావముకల వాడైనను, పొరబాటున నొకనితో నీ సంగతిని చెప్పినందున, నతడు దానిని కీమరు చెవినివేసెను. ఏపనియు లేనందున, నతడు వార్తాపత్రికను ముద్రించుటకు సన్నద్ధు డయ్యెను. 'సర్వ శాస్త్ర - కార్యబోధిని' యనుపేరుతో నొక పత్రిక నతడు ప్రచురము చేసెను. దీని నందఱు శ్లాఘించిరి.

దీనినిచూచి రోషాయత్తచిత్తుడై, బెంజమిను వ్యాకులము పొందెను. ధైర్యము తెచ్చుకొని, జంటోసమాజము వారి సహాయమున, నిత డొక పత్రికను ప్రచురించుట కారంభించెను. 'అధికప్రసంగి' యను పేరుతో నీపత్రిక వెడలెను. ఇది యన్నిటిని పరిహసించి, యెగతాళిచేయుచుండెను. "మేము సత్యమును చెప్పుటచే, మీకందఱికి కష్టముగ నుండును. మీ తప్పులను దెలిసికొనుటకు కదా, మీరు సంవత్సరమున కెనిమిది రూప్యములను మా కిచ్చుచున్నారు. అవును ఇప్పుడు మీతప్పులను జూచి నవ్వువారి సమయముకూడ వచ్చునుగాన, మీరిప్పుడు వారినిజూచి నవ్వవచ్చును" అని 'అధిక ప్రసం