పుట:BashaChaaritrakaVyasavali.djvu/197

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

29. చబుకు : కొరడా, చేఱుకోల. 'వాజిశవంబుల వడిమిద నెక్కి చబుకుల గొట్టుచు చనుమను వారు ' (పల్నాటి. పు. 119), ' సమరసము జూపి నెఱయ బగ్గములు వదలి. సైంధవంబుల ధేయని చబుకు సేయ ' (జై. 6-53) మరాఠీ, చాబూక = కొరడా. పారసి చాబుక్ = కొరడా; చాబుక్ బాజి = చబుకు సేయుట. చబుకుతో గొట్టుత. ' చబుకు గ్రామ్యమనియు, పారసి జన్యమనియు కాంబెల్. (Campbel, p. 224).

30. చవుక : రూ. చౌక. ఎల్లిదము. లోకువ.

31. చాడి : కొండెము.

32. చావడి : కొలువు కూటము, రచ్చ, కార్యస్థానము.

33. చికిలి-తుడిచి చక్కచేయుట