పుట:Balavyakaranamu018417mbp.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యధికరణం బని సమానాధికరణంబని ద్వివిధంబు - ద్వితీయాదులకు మీఁదిపదఁబుతోడ సమాసంబు వ్యధికరణంబు నాఁబడు - నెలతాల్పు - నెలతక్కువవాఁడు - దేవరమేలు - దొంగభయము - రామునిబాణము - మాటనేర్పరి. విశేషణంబునకు విశేష్యంబుతోడ సమాసంబు సమానాధికరణంబు నాఁబడు - ఇదియె కర్మధారయంబు నాఁబడు. సరసపువచనము - తెల్లగుఱ్ఱము - మంచిరాజు. ఇది సంఖ్యాపూర్వంబు ద్విగువునాఁబడు - ముజ్జగములు - ముల్లోకములు. బాహువ్రీహి ముక్కంటి - చలివెలుఁగు. ద్వంద్వము - తల్లిదండ్రులు - అన్నదమ్ములు. ప్రాయికంబుగా ననుటచే సంస్కృత లక్షణంబుఁ దొడరని సమాసంబుంగల దని సూచింపంబడియె. దానంజేసి చిగురుఁగేలు - జుంటిమోవి ఇత్యాదులయిన యుపమాన పూర్వపదకర్మధారయంబులు గ్రాహ్యంబులు. ముఖపద్మము - చరణకమలములు. ఇట్టి యుపమానోత్తరపదంబులు గలవుగాని విపరీతంబులు సిద్ధంబులులేవని యెఱుంగునది. సిద్ధంబు సర్వంబు గ్రాహ్యంబు. రాజపురుషుఁడు - నీలోత్పలము - పీతాంబరుఁడు - రామలక్ష్మణులు. కేవల సంస్కృతశబ్దము వికృతి శబ్దముతోడ సమసింపదు - దానంజేసి యనేకమాఱు లల్పదం డిత్యాదులు దుష్టములని తెలియునది.

4. ఆ ఈ ఏ యను సర్వనామంబులు త్రికంబు నాఁబడు.

5. కర్మధారయంబు త్రిక స్త్రీ సమముగంత ధాతుజ విశేషణ పూర్వపదం బయి యుండు.