పుట:Balavyakaranamu018417mbp.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21. బహువచనంబు పరంబగునపుడు రేయి ప్రభృతుల తుది యక్షరంబు లోపించు.

రేయి - రేలు, ఱాయి - ఱాలు, వేయి - వ్రేలు, వ్రాయి - వ్రాలు ఇత్యాదులు. ఈ లోపంబు సమాసంబులందుం జూపట్టెడు. రేరాజు - మగఱాపతకము - వేవెలుఁగు.

22. బహువచనంబు పరంబగునపు డావు ప్రభృతుల తుదియక్షరంబునకు లోపంబు విభాష నగు.

ఆవు - ఆలు - ఆవులు, జాము - జాలు - జాములు, చుట్టము - చుట్టలు - చుట్టములు, మీసము - మీసలు - మీసములు.

23. ఇ య కు మాఱుగా నామాంతంబున కెత్వంబు బహుళంబుగా నగు.

కన్నియ - కెన్నె, జన్నియ - జన్నె, వన్నియ - వన్నె, కొంచియము - కొంచెము, కొండియము - కొండెము. బహుళ గ్రహణముచే సందియము కాఱియ మొదలగు శబ్దంబులందెత్వములేదు. ఇయశబ్దంబునం దికారలోపంబు కొందఱు వక్కాణించిరి. అయ్యది ప్రయోగంబులందు మృగ్యంబు. ముత్తియ శబ్దంబునందు మాత్ర మిత్వలోపంబు గానంబడియెడి. ముత్తియము - ముత్తెము - ముత్యము.