పుట:Balavyakaranamu018417mbp.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తత్సమ పరిచ్ఛేదము

1. డు-ము-వు-లు - ప్రథమ.

2. నువర్ణంబు - ద్వితీయ.

3. చేత-తోడ - తృతీయ.

4. కొఱకు-కయి - చతుర్థి.

5. వలన-కంటె-పట్టి - పంచమి.

6. కు-యొక్క-లోపల - షష్ఠి.

7. అందు-న - సప్తమి.

8. తృతీయాదులకు నుగాగమంబగు.

రాముని చేతను, రాముని తోడను, రాముని కొఱకును, రాముని వలనను, రాముని కంటెను, రామునకును, రామునియందును.

9. కయి పట్టి యొక్క లకు నుగాగమంబు లేదు.

రామునికయి, జ్ఞానముఁబట్టి, రామునియొక్క.

10. చేత - తోడ లోపల వర్ణకంబుల ప్రథమాక్షరంబులు వైకల్పికంబుగా శేషించు.

ప్రత్యయంబు వర్ణకంబని ప్రాచీనులు వ్యవహరింతురు. రామునిచే, రామునితో, వనములలో

11. డు-ము-వు-న లేకవచనంబులు.

ఏకత్వసంఖ్యను బోధించు ప్రత్యయం బేకవచనంబు. రాముఁడు, సోముఁడు, వనము, ధనము, ధేనువు, భానువు.

12. లు వర్ణంబు బహువచనంబు.

బహుత్వ సంఖ్యను బోధించు ప్రత్యయంబు బహువచనంబు.