పుట:Balavyakaranamu018417mbp.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నమ్మకము ... ఇట ... నమ్మకిట, నమ్మకు మిట

49. ఆమ్రేడితంబు పరంబగునపుడు మధ్యమ ముడుఙ్ఙు లోపంబు విభాష నగు.

ఉండుము ... ఉండుము. ... ఉండుండుము ,ఉండుముండుము

కొట్టుఁడు ... కొట్టుఁడు. ... కొట్టు కొట్టుఁడు, కొట్టుఁడు కొట్టుఁడు

50. విసర్గంబున కనుకరణంబున లోపం బగు.

వర్ధతాం శ్రీః ... అనియె ... వర్ధయాం శ్రీ యనియె.

51. అనుకృతిని నమశ్శబ్దము తుది యత్తున కోత్వము విభాష నగు.

తుభ్యంనమః ... అనె ... తుభ్యంనమో అనె, తుభ్యం నమ యనె

ఈ కార్యము లాఁతిచో సహితము గనంబడియెడి. గతాను గతికో లోకో యటంచున్‌.

52. అనుకరణంబునం దుదిహల్లునకు ద్విర్వచనం బగు.

కింతత్‌ ...అనియె ... కింతత్తనియె

కస్త్వమ్‌ ... అనియె ... కస్త్వమ్మనియె