పుట:Balavyakaranamu018417mbp.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెల్ల ... తనము ... తెల్లందనము, తెల్లఁదనము, తెల్లన్దనము

36. సమాసంబునఁ బ్రాఁతాదుల తొలియచ్చుమీఁది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగా నగు.

ప్రాఁత ... ఇల్లు ... ప్రాయిల్లు, ప్రాఁతయిల్లు

లేఁత ... దూడ ... లేదూడ, లేఁతదూడ

పూవు ... రెమ్మ ... పూరెమ్మ, పూవురెమ్మ

37. లుప్త శేషంబుకుం బరుషములు పరములగునపుడు నుగాగమం బగు.

ప్రాఁత ... కెంపు ... ప్రాఁగెంపు

లేఁత ... కొమ్మ ... లేఁగొమ్మ

పూపు ... తోఁట ... పూఁదోఁట

మీఁదు ... కడ ... మీఁగడ

కెంపు ... తామర ... కెందామర

చెన్ను ... తోవ ... చెందోవ

చెన్ను శబ్దము వృత్తిని శోణార్థకంబు. బహుళ గ్రహణముచే మీఁదు ప్రభృతులం నిట లోపంబు నిత్యంబు. వ్యవస్థిత విభాషచే నీ ద్రుతంబునకు సంశ్లేషంబు లేదు.