పుట:Balavyakaranamu018417mbp.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సరసము ... మాట ... సరసపుమాట, సరసంపుమాట

విరసము ... వచనము ... విరసపువచనము, విరసంపువచనము

33. ఉదంతమగు తద్ధర్మార్థవిశేషణమున కచ్చు పరమగు నపుడు నుగాగమం బగు.

చేయు ... అతఁడు ... చేయునతఁడు

చేసెడు ... అతఁడు ... చేసెడునతఁడు

34. షష్ఠీసమాసమునం దుకార ఋకారముల కచ్చు పరమగునపుడు నుగాగమం బగు.

విధాతృయొక్క ... ఆనతి ... విధాతృనానతి

రాజుయొక్క ... ఆజ్ఞ ... రాజునాజ్ఞ

35. ఉదంత స్త్రీసమంబులకును, బుంపులగు నదంతగుణవాచకంబులకును దనంబు పరంబగునపుడు నుగాగమంబగు.

సొగసు ... తనము ... సొగసుందనము, సొగసుఁదనము, సొగసున్దనము

సరసపు ... తనము ... సరసపుందనము, సరసపుఁదనము, సరసపున్దనము