పుట:Balavyakaranamu018417mbp.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూచెను ... కలువలు ... పూచెను గలువలు

తోఁచెను ... చుక్కలు ... తోఁచెను జుక్కలు

చేసెను ... టక్కులు ... చేసెను డక్కులు

నెగడెను ... తమములు ... నెగడెను దమములు

మొగిడెను ... పద్మము ... మొగిడెను బద్మము

17. ఆదేశసరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషములు విభాష నగు.

సంశ్లేషం బనగా మీఁది హల్లుతోఁ గూడికొనుట.

పూచెను గలువలు .... పూచెంగలువలు, పూచెఁగలువలు, పూచెన్గలువలు

తోఁచెను జుక్కలు .... తోఁచెంజుక్కలు, తోఁచెఁజుక్కలు, తోఁచెన్జుక్కలు

చేసెను డక్కులు .... చేసెండక్కులు, చేసెఁడక్కులు, చేసెన్డక్కులు

నెగడెను దమములు ... నెగడెందమములు, నెగడెఁదమములు, నెగడెన్దమములు

మొగిడెను బద్మము ... మొగిడెంబద్మము, మొగిడెఁబద్మము, మొగిడెన్బద్మము