పుట:Balavyakaranamu018417mbp.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

ఆంధ్రభాషకు లక్షణగ్రంథములు ప్రాచీనులు చేసినవి పెక్కులు కానబడుచున్నవి. కొన్ని లక్షణగ్రంథముల పేళ్లు మాత్ర మిప్పుడు వినబడుచున్నవి. కానబదు గ్రంథములందు సంస్కృతసమములకు లక్షణములు బహుతరముగా రచింపబడినవిగాని తక్కినభాషకు విశేషాకారముగా రచింపబడినవికావు. కాబట్టి యాలక్షణగ్రంథములు చదువువారికి నిస్సందేహముగా వచనరచనసేయు కౌశలము చిరకాలము బహులక్ష్యములందు పరిశ్రమముచేయక రానేరదు. భాషాసమిష్టికి లక్షణగ్రంథము కుదిరినపక్షమం దంతశ్రమపడ బనిలేదు. తుదకు లక్ష్యపరిజ్ఞానముచాలని లక్షణపరిజ్ఞానమంత శ్లాఘ్యము కాదుగాని తుదముట్ట సర్వలక్షణపరిజ్ఞానము లక్ష్యపరిజ్ఞానము చేతనే సాధించుట మిక్కిలి దుష్కరము. కాబట్టి యిట్టి కొరత వారింపబూని పెక్కు లక్ష్యములు పలుమారు సావధానముగా బరిశీలించి రచనా ప్రణాళిక నిర్ణయించుకొని నా నేర్పుకొలదిని సంస్కృతభాషతో సూత్రగ్రంథమొకటి కావించితిని. ఆగ్రంథము బాలురకు --- గాకుండుటవలన దానియందలి సూత్రములు కొన్ని తెనిగించి ప్రకృతగ్రంథ రూపముగా రచించినాడ.

కందము.

మానితపునడపేరిమి
మానసమున కింపు బెంప మనునంచలకున్
లోనిడి నీరసనీరము
జానుగ క్షీరంబుగొనుట సహజముకాదే.