పుట:Balavyakaranamu018417mbp.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూడక ... ఉండెను ... చూడకుండెను, చూడకయుండెను.

బహుళ గ్రహణముచేత స్త్రీవాచక తత్సమ సంబోధనాంతంబులకు సంధిలేదు.

అమ్మ ... ఇచ్చెను ... అమ్మయిచ్చెను.

దూత ... అతఁడు ... దూతయితఁడు.

చెలువుఁడ ... ఇందము ... చెలువుఁడయిందము.

సంస్కృతీయంబునకు సంధి యగునని యధర్వణాచార్యులు చెప్పిరిగాని దానికిం బూర్వకావ్యంబులందుఁ బ్రయోగంబు మృగ్యంబు. ఆధునిక కృతులం దొకానొకచోట స్త్రీవాచక తత్సమంబులకు సంధి గానం బడియెడు. గంగనుకాసె - నెలఁతిచ్చెను. వెలయాల్వాదుల సంధిలేమి బాహుళకముచేతనే యని యూహించునది.

5. ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగా నగు.

ఏమి - మఱి - కిషష్టి - అది - అవి - ఇది - ఇవి - ఏది - ఏవి. ఇది యాకృతి గణంబు.

ఏమి ... అంటివి ... ఏమంటివి, ఏమియంటివి.

మఱి ... ఏమి ... మఱేమి, మఱియేమి.

హరికిన్‌ ... ఇచ్చె ... హరికిచ్చె, హరికినిచ్చె.