పుట:Balavyakaranamu018417mbp.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాకున్‌ ... ఆదరువు ... నాకాదరువు, నాకునాదరువు.

నాయందున్‌ ... ఆశ ... నాయందాశ, నాయందునాశ.

ఇందున్‌ ... ఉన్నాఁడు ... ఇందున్నాఁడు, ఇందునున్నాఁడు.

ఎందున్‌ ... ఉంటివి ... ఎందుంటివి, ఎందునుంటివి.

వచ్చుచున్‌ ... ఉండెను ... వచ్చుచుండెను, వచ్చుచునుండెను.

చూచుచున్‌ ... ఏగును ... చూచుచేగెను, చూచుచునేగెను.

3. సంధి లేని చోట స్వరంబుకంటెం బరంబయిన స్వరంబునకు యడాగమంబగు. ఆగమం బనఁగా వర్ణాధిక్యంబు.

మా ... అమ్మ ... మాయమ్మ.

మీ ... ఇల్లు ... మీయిల్లు.

మా ... ఊరు ... మాయూరు.

4. అత్తునకు సంధి బహుళముగా నగు.

మేన ... అల్లుడు ... మేనల్లుడు, మేనయల్లుడు.

పుట్టిన ... ఇల్లు ... పుట్టినిల్లు, పుట్టినయిల్లు.