పుట:Balavyakaranamu018417mbp.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుంభకర్ణుఁడు - గింభకర్ణుఁడు, రావణుఁడు - గీవణుఁడు.

23. పాదంబునం బ్రథమ ద్వితీయాక్షరములు వళిప్రాసంబులు నాఁబడు.

24. య వ ల లు లఘ్వలఘువులు మైత్రిం బొరయు, రేఫంబులు పొరయవు.

25. రేఫంబులు లఘ్వలఘువులుం దక్కుంగల విశేషంబులు నార్యవ్యవహారంబులఁ దెలియుట శ్రేయంబు.

శ్లో. శ్రీస్తనాఞ్చితకస్తూరిపఙ్కసఙ్కలితోరసే పఙ్కజాక్షాయ నాథాయ వేఙ్కటేశాయ మఙ్గళమ్‌.

ఇది ప్రకీర్ణక పరిచ్ఛేదము.

బాలవ్యాకరణము సంపూర్ణము.