పుట:Balavyakaranamu018417mbp.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19. అబ్బురాదులం దుత్వంబునకు లోపంబు విభాష నగు.

అబ్బురము - అబ్రము. అబ్బురము - కప్పురము - అప్పుడు - ఇప్పుడు - ఎప్పుడు - చప్పుడు - నెత్తురు ఇత్యాదులు.

20. చుక్పరక రు వర్ణంబునకు ముందఱి దు వర్ణంబు నుత్వంబునకు లోపంబు విభాషనగు, నగుచోఁ దత్పూర్వంబు గురువు గాదు.

అదురుచు - అద్రుచు, ఎదురుచు - ఎద్రుచు, పదురుచు - పద్రుచు.

21. జూదాదుల దాకు జకారంబు విభాష నగు.

జూదము - జూజము. అవుదు - జవాది - జాది - జాదు - విరవాది.

22. నిందయం దామ్రేడితంబు నాద్యక్షరములకు హ్రస్వదీర్ఘంబులకు గిగీ లగు.