పుట:Balavyakaranamu018417mbp.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15. ఏతాదులకు మువర్ణకంబు పరంబగునపుడు దీర్ఘంబు విభాష నగు.

ఏతము - ఏతాము. ఏతము - కళ్ళము - గాలము - గుడ్డము - గోణము - గోతము - జాజము - జుంజము - జోతము - తణగము - బొండ్లము - మండము - లాతము - వీణము ఇత్యాదులు.

16. పదాంతంబు లయి యసంయుక్తంబు లయిన ను లు రు ల యుత్వంబునకు లోపంబు బహుళంబుగ నగు.

ఇందు నురుల కుత్వలోపంబు ప్రాయికంబుగ హల్పరకంబులకుఁ జూపట్టెడు. మ్రాన్పడె - మినువడె - మిన్వడె - వత్తురు వారు - వత్తుర్వారు - కారుకొనియె - కార్కొనియె - రాములు - రాముల్‌ - వనములు - వనముల్‌.

17. ఆచ్ఛికంబులం బదమధ్యంబుల న ల డ ర ల యుత్వంబునకు లోపంబు బహుళంబుగ నగు.

కినుక - కిన్క, కానుక - కాన్క, చిలుక - చిల్క, కాలువ - కాల్వ, అడుగు - అడ్గు, కడుపు - కడ్పు, పెరుగు - పెర్గు, కూరుకు - కూర్గు.

18. లాఁతియచ్చునకు సహిత మొకానొకచో నుడినడుమ లోపంబు గానంబడియెడి.

కలికి - కల్కి, ములికి - ముల్కి, బుడిపి - బుడ్పి, పొలఁతి - పొల్తి.