పుట:Balavyakaranamu018417mbp.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. ఆరాటాదులం బ్రథమేతర దీర్ఘంబునకు హ్రస్వంబు విభాష నగు.

ఆరాటము - ఆరటము. ఆరాటము - కక్కూఱితి - కేళాకూళి - కొమారుఁడు - కొమారిత - గంబూరము - పెండారము - బంగారము - బేహారము - వీటతాటము - సంతోసము.

12. ఓయారాదులం దొలిదీర్ఘంబునకు హ్రస్వంబు విభాష నగు.

ఓయారము - ఒయారము. ఓయారము - కేళాకూళి - కోలె - గూడారము - గోరువంక - పక్షి - జోహారు - నీలుగు - పేఁడ - బేహారము. దీర్ఘమధ్యంబు - మాఱు - మూలుగు - మోఱకు - వీటతాటము - వీడియము - ఇత్యాదులు.

13. అడంగ్వాదుల డాకు ణ కారంబు విభాషనగు.

అడఁగు - అనఁగు. అడఁగు - కడఁగు - చిల్లాడము - తడగము - నాఁడెము - పోఁడి - మిడుఁగు - వదఁకు - మిడుఁగుఱు ఇత్యాదు లడంగ్వాదులు.

14. దక్కులోనగువాని దాకు డ కారంబు విభాష నగు.

దక్కు - డక్కు. దక్కు - దగ్గఱు - దాఁగు - దాకలి - దిగు - దిగ్గియ - దూయు - దెందము - దెప్పరము - దెప్పు - దొంగ - దొప్ప ఇత్యాదులు.