పుట:Bala Neethi.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
80

బా ల నీ తి.

బ్రియముగా సంభాషించుచుండెను. అంత నాకందర్పు డా యింద్రుని వినయాదులకు సంతోషించి "మహేంద్రా! స్వర్గలోకాదిపతివగు నీవు, సామాన్యుడగునన్ను బిలిపించుటకు గారణమేమి? మీరానతిచ్చినపని యేదియైన నాలీలగా దప్పక చేయుద" నని సాహసించి పలికెను. అంతనాదేవేంద్రుడు "మన్మధా! నీవ్చు చతుర్దశభువన పరిపాలకుండగు విష్ణునిపుత్రుడవు. మహాపరాక్రమశాలివి. నీతో సమానమైన వారీ ముజ్జగము లను లేరు, మఱియు నాకు రెండస్త్రములు కలవు. (1)నా వజ్రము (2)నీవను వస్త్రము వజ్రము సస్మస్తప్రదేశములందును జొచ్చునుగాని విరాగుల జోలికి పోనేరదు. నీవను వస్త్రమున్ననో కాముకుల యందును, మౌనులయందును మఱియు బ్రతిచొటను బ్రవేశించి కార్యముసాదించగలదు. కాన సర్వము నీయందున్న" దని లేనిపోని వానినిగలిపి యెక్కువగా స్తొత్రముజేసి యామదమని నుబ్బించి "నెచ్చెలీ! నీమిత్రులమగు మేము తారకాసురుని వలన బాధ పడుచున్నాము. వానిని సంహరించుట కీశ్వరకుమారుడు తప్ప మేమెవరము శక్తులము కాము. కాన మహేశునికి గుమారసంభవమగునటుల జేయుము. తదుపరి మాబాధలుదీర్చు" మని యనేక భంగుల గోరెను. అంత రతీదేవుడు తన సఖీసఖు లిరుగురు వద్దువద్దనుచుండ వల్లెయని పాక శాసనుని వీడ్కొని తనసఖుడగు వసంతునితో ఘోరముగా దపమాచరించుచున్న గంగాధరుని, నతనినారాదించుచున్న