పుట:Bala Neethi.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
78

బా ల నీ తి.

యు చుందురు. కడకు దామువచ్చినపనిని నివేదించి నెఱవేర్చుడని కోరుచుందురు. ఆసమయమున గొందఱు, వారోనరించిన ముఖస్తుతికుబ్బి తబ్బిబ్బుపడి వారిమాటకు మారుమాటాడనేరక వారుకోరిన పనిని దమసామర్ద్య మంతయు వినియోగించి కొనసాగునటుల జేయుచుందురు.

    ఎటులైననేమి? పరొపకారము జేయుచుండిరికదా యని యనెదరేమో? కాని యటుల జేసినది సిష్ప్రయో జనమేయగును. కారణమేమన? ముఖస్తుతిజేయు వారలు సామాన్యముగా నుత్తములుగా నుండరు. కాన నిట్టివారల కుపకారమొనరించుట మంచిదికాదని చెప్పి యుంటినికదా.
   ఎవరు మనయెదుట గైకోలుసేయుచు మనమాచరించని మంచిగొప్పపనులను మనము జేసినటుల నారొపించి ప్రియముగా సంభాషించు చుందురో వారావల మగుడ మనల నిర్లక్ష్యముగా జూచెదరు. కాని వీరిని శత్రువులుగా భావించుము. ఎవరు సద్భుద్దితో   మనయెదుట మన మంచిగుణములదాచిపెట్టి దోషముల నెత్తిచూపించు చు వానికి బ్రతిక్రియల దెల్పుచు హితముపదేశించు చు మనల గొనియాడక కఠినముగా మాటలాడు చుండెదరో వారావల మనమంచిగుణముల బ్రకటించి మ్నమెక్కువ సత్కీర్తిజెందునటుల జేయుచుందురు. కాన వీరిని మిత్త్రులనుగా భావించుము.
  ఈయిద్దరిలోముఖస్తుతిజేయువానిపలుకులు మనకు జిలుకపలుకులుగా నుండును. కాని యటు తరువాత హీనదశ