పుట:Bala Neethi.pdf/86

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


(10)

78

బా ల నీ తి.

కము నొకదానిని ద్రవ్వించి వానికాహారార్దమై గడ్ది మొదలగువాని నియ్యవలెను. పక్షులు, వసించుటకు గూళ్లనిర్మించి యవితినుటకు దగినపదార్దములు నిచ్చు చుండవలెను. సాధుస్వభావముగలిగినమృగములకు దగిన యాహారపదార్దముల నిచ్చుచుండవలెను. ఇట్లు దానముజేయు వారల నుత్తములనిచెప్పితీర వలయును.

     మఱియు నేప్రాణి యైనను భయముకలిగి తన్ను శరణుజొచ్చినయడల యధాసామర్ద్యముగ నభయ మొసంగి రక్షించవలయును. ఇదియే వధాన్యుని లక్షణము.ఇదిలేని వాడు జాతకానేరడు. 
   యోగ్యుడు దానమునీదలచిన వానినినెవడు నాపలేడు. హీనుడు దానమీయదలచియు నొకనిబోధకు లొంగిదానమియ్యక యాగిపోవును. వీడపకీర్తిపాలు కాగలడు. మఱియు లోకోపకారము లగు దానములు కొన్నిగలవు. ఈదానముల నొనరించినవారి నామములు బహుకాలము ప్రచారములో నుండగలవు.వీనివలన బరలోక సౌఖ్యము కలుగును. కాన వాని నాచరించుటకు బ్రయత్నించవలెను. ఆదానములేవియనిన? విద్యార్ధు;ఇ చదువు కొనుటకై విద్యాశాలలు నిర్మించుట చెఱువులుద్రవ్వించుట, తోటలువేయించుట, సత్రములుగట్టించుట, దేవాలయములు బ్రతిష్టించుట, వైద్యశాలలు స్ధాపించుట,పుస్తకపత్రికాపఠనశాలలు నెలకొల్పుట, సత్కృ