పుట:Bala Neethi.pdf/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


71

బా ల నీ తి.

మనదగ్గఱకు మంచియాచకులు వచ్చినయెడల వారికి నేమియు నియ్యక వ్యర్దముగా వెడల గొట్టక సంభావించి యధాశక్తి దానమొసంగుట వివేకునిలక్షణము తానాపదల బొందుచున్నను ధర్మమునుమాత్రము విడనాడగూడదు. భయముకల వాడై శత్రువువచ్చి తన్నుశరణు బొందినయెడల వానికభయదానం లొసంగి రక్షింపవలయును. దానము జేయునపుడు ప్రతివారును బాత్రాబత్ర విచారణజేయుట ముఖ్యము. పాత్రమనిన యోగ్యము. అపాత్ర మనిన యోగ్యము కానిది. ఎటువంటి వారలకు దానమొసగవలెనన? వేదములను, వేదాంగములను, జక్కగా సుస్వరముతో బఠించిన వారును, నకల్మషల్మనస్కులును, నగు నవధానులకును, సంస్కృతభాషనభ్యసించి సత్ప్రవర్తన కలిగినవానికిని, విద్యావిహీనులైనను సద్గుణులకును, గుటుంబము కలవారికిని దాన మొసగుట పరమార్దమన జెల్లు. ఆకలిచే బాధపదుచునన్నముబెట్టుమని మనకడకు వచ్చినవా డేజాతివాడైనను వానికన్నదాన మొనరించుటయు బరమార్దమన జెల్లు. ఈ పైవారలకు దానముగా నొకవస్తువునిచ్చినను నన్నమును బెట్టినను వారినినాపదనుండి రక్షించినను బ్రయోజనముకలదియగును. తదితరులకు దానమొసంగిన నిష్ప్రయోజనమ యగును. ఎటులన? పిసిని తనముగలిగిన యొకని కొక వస్త్ర మిచ్చితిమని యనుకొనుడు, వాడుమనమిచ్చినవస్త్రమును దీసికొని