పుట:Bala Neethi.pdf/82

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


69

బా ల నీ తి.

సంగతి నీమయుడు మఱువక కృతజ్ఞతకలవాడై మురారితోడ నర్జనుడు సుఖముగా గూర్చున్న తఱి వచ్చి "స్వామీ నేను దానవవిశ్వకర్మను. శిలివిద్యా చమత్కృతియం దుత్తీర్ణుడైన వాడను. కాన నాకు మేలొనరించిన మీకు దగినంతమేలు జేయలేకపోయి నను జేతనైనంత మేలుజేయుటకై వచ్చితిని. కాన మీకిష్టమైనదానిని నిర్మిచెద. ఆజ్ఞాపింపు" డనెను.

    అంత నంక్రందనందనుడు నందనందనుజూచి యితని నొక్క యపూర్వంబగుదానినినిర్మింపనానతిం డని పలికె. అంత గృష్ణుడు యోచించి మయునిజూచి "నీవు నీవిద్యాసామర్ద్యంబు వినియోగించి యిట్టిదిది వఱకు లేదని యంద అద్భుతముజెందునటుల నొక సభ నిర్మించి తీసికొనివచ్చి ధర్మరాజునకొసంగు మని పలికెను. అటుపై మయుడు సరేయని చెప్పుచు నింకను గదాదులను బీమాదులకు దెచ్చియిచ్చెద నని పలికి యనుజ్ఞగైకొని తనసదనమునకు జనెను. తరువాత వాడుమైనాక పర్వతముమున కనతిదూరముననుండు బిందు సరోవరమునుజేరి యందుండు రత్నాదుల గైకొని యింటికిజేరెను. అంతట నాతడు తానుదెచ్చిన రత్నాదులనన్నింటిని నాసభయందు జొన్పి యనిర్వాచ్యంబగు గాంతిచే ధగద్దగాయమానంబైప్రకాశించుచుండునటుల బదిమేలమూరలు గలిగిన నిడివియును దానికి దగిన వెడల్పును, గలుగునట్లొకసభ నిర్మించెను. దాని నెనిమివేల రక్కసులతో మోపించుకొని వచ్చి