పుట:Bala Neethi.pdf/81

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


68

బా ల నీ తి.

కారుల నెదనెల్లప్పుడు నుతించుచుండవలను. ఇతరునిచేదారి గొలది మేలుబొంది యాతనికన్న నభివృద్దిదశకు వచ్చినను నామేలుమఱవక సాయము జేయుట మంచిది. కొబ్బరిచెట్టు పాదున మనము రెందు నెలలు లేక మూడునెలలు మంచియుదకము బోసి కాపాడిన నానారికేలవృక్షము క్రమక్రమముగా బెద్దదై ఫలవంతమైన తరువాత వాని కాదిని రెండు నెలలుమాత్ర ముదకమిదికాపాడిన మనలను మఱవక కృతజ్ఞతకలదై తననెత్తిపై నంతాపహరంబును, నమృత తుల్యంబును నగు జలముతో గూడికొనిన ఫలముల బెట్టికొని తనజీవితాంతమువఱకు నిచ్చుచున్నది గదా. కాబట్టి యితరునిచే గొంచెము లాబముబొందినను గృతజ్ఞత గలిగియుండవలెను. భగవంతుడు, గురువులు, రాజులు, తలిదండ్రులు మొదలగు వారిచే మేలుబొందనివారీ భూతలమున లేరు. కాన వీరలందు గృతజ్ఞత కలిగి యుండవలెను. ఉపకారులదు గృతఘ్నత కలవారు కృతాంతానుగ్రహపాత్రులు. "కృతఘ్నత" యనగా జేయబడిన మేలును మఱచుట. కృతజ్ఞడె కృతముఖుడు కాగలడు. ఇటుల గృతజ్ఞత కలిగి తిరిగి తనకు చేతనైనంత మేలొనరించి వాసిగాంచి వారలు పూర్వులలో గలదు. వారిలో నొకని జెప్పెద.

   శ్రీకృష్ణార్జును లగ్నిచే ఖాండవవనమును దహనంబు జేయుచున్న సమయమున మయు డనువాడు రక్షణ సేయుమని ధనం జయుని మరుగు సార నాయర్జునుడు డతనిని రక్షించెను. ఆ