పుట:Bala Neethi.pdf/80

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


67

బా ల నీ తి.

సాయము జేయుటకై యెక్కువప్రయత్న మొనరించు చుండవలెను. ఇది కృతజ్ఞనికి ముఖ్యలక్షణము.

    మన మొక కుక్కను దీసికొనివచ్చి దానికి బ్రతి దినము మనమారగించగా మిగిలినయన్నమును బెట్టెదము. వేయుచుండిన నది గాఢాంధ కారముతో గూగుకొను, నమావాస్యా రాత్రులయందు నిద్ర విడనాడి యనిమిషత్వము నంది మన యింటిచుట్టును దిరుగుచు దొంగల రానీయక మనలను, మనధనాదు లను గాపాడుచుండును. మఱియు నాతన్కరులా ర్భటిని వచ్చినయెడల మనలను నిద్ర నుండి మేల్కాంచునటులజేసి మనల దోడ్కొని యా చొరుల మార్గమును మనకు జూపించుచుండును. అప్పుడు మనమా దొంగల బాఱద్రోలవచ్చునుగదా. ఈకుక్కయే లేనియెడల మనసంగతి యెటులుండునో? పట్టెడన్నమును వేయుచుండిన మనలను మఱవక మగుడ మనకు నెంతయుపకార మొనరించు చున్నదో కాంచితిరిగదా. కాబట్టియె విద్యావిశారదులగు నైఘంటికులు దానికి గృతజ్ఞమనిపేరిడిరి. కృతజ్ఞమనిన కుక్కయని యర్దము. తిర్యగ్జంతువగు నాకుక్క యటుల గృతజ్ఞత కలిగి క్రమ్మఱసాయము జేయుచుండగా నమూల్యం బగు బుద్దిగల మనము కృతజ్ఞతగలవారమై యుండుట యొకచిత్రముకాదు కదా.
     ఇతరునివలన దానుమేలు బొందినయెడల నది మఱవక యతని కేదో యొక సమయమునందు సహాయము జేసి తీరవలయును. తనకు సాయము జేయుశక్తిలేనితఱి నాయుప