పుట:Bala Neethi.pdf/77

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


64

బా ల నీ తి.

తొ "బ్రతిదినమిలువరుస రెండెనుబోతులను, బండెడు రక్తమాంసమిశ్రితాన్నమును, నొకమానిసినిదెచ్చి నీకియ్యగలము. కాన స్వేచ్చగా జనులనుజంపుట దయచేసి మానుకొనమని మనవి జేసికొనిరి. ఆరక్కసు డందుల కంగీకరించెను. ఆయేర్పాటుప్రకార మిలువరస జరుగుచువచ్చినది. నేటికాయేర్పాటు మాయింటికిగూడ సిద్ధమాయెను. మాయింటిలో నాబార్యయు, గొమరితె, కొమరుడు, నేను, నలుగురము గలము. కాని యొకరినొకరు విడిచిపట్టలేక గగ్గోలుగా నీవిధమున నేడ్రుచుంటి" మని చెప్పెను. అంత గుంతీదేవి వీరియవస్దంగని పరోపకార పారీణురాలు గనుక వారుకోరకపోయినను వారితో "మీరు దు:ఖింపకుడు. నాకైదుగురు కొమరులు గలరు. అందున రెండవకుమరు డారక్కసున కాహారముగా బోగలడని వచించెను. అంతట నాయజమానుడు చెవులుమూసుకొని 'రామరామ మాయింటికధితులుగా వచ్చిన మిమ్ములను స్వకీయప్రాణ సంరక్షణార్దమై రక్కసుని కాహారంబుగా బంపించుట పాటియే? పాడివిడిచి మీరుచెప్పిన విధమున నేనొరించిన నాకు సత్కీర్తి లభించునా? లభించదు. కాన దాని నేవిననొల్ల, నని యామెతో ననెను.

     అంత గుంతి "అయ్యా! మీయవస్దజూడలేక నారెండవకుమారుని మీకుబదులుగా బంపదనంటిని. నాకుమారుని భక్షించుట కారక్కసునికి వశముకదు. ఈకుమారు డిది వఱకే మహాబలవంతు లనేకుల జంపినవాడు. వీనినిగూడ