పుట:Bala Neethi.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
62

బా ల నీ తి.

వెళ్ళి తిరిగివచ్చుచుండగ నెండ వడ దాకుచుండి నపుడు దాహమైనయెడల జెంతనే యొకనదికాని యుకతటాకముకాని లేక యొక మడుగుకాని యున్న నది మనదాహమార్పి యెండవేడిమినంతయు బోగొట్టిన మనము హర్షమందుచుండుటలేదా ఆనదుల నిటుల జేయమని యెవరుకోరిరి? కోరకపోయిన నావిధమున నుపకారము జేయుటవలనగాదెనదులు జలాశయ ములు పరోపకారమునకై జనించినవని చెప్పుదురు. నభోమణి తనకిరణములచే బద్మములను వికసింప జేయుచుండును. నికామనోహరుడుత్పలముల వికసింపజేసి వానినానంద భరితములనుగా జేయు చుండును. అటులనే సజ్జనులు తపప్రజ్ఞానాదుల నితరుల యుపకాఱముకొఱకై యుపయోగించు చుందురు. నీచులు తమకు లాభమువచ్చునటుల గానుపించిన తతక్షమే యితరులలాభముల బోగొట్టు చుందురు. ఇక నింతకంటె నికృష్టులు తమకెంత మాత్రము ప్రయోజనములేకపోయినను నితరులఫల ముల నాశముజేయుచుందురు. కాన మనము మన శక్తికొలది సుచరితులుచేయు మార్గము నవలంబి చుట కుద్యమించుచుడవలెను. శరీరమునకు జందనాది సుగంధ ద్రవ్యముల నెన్నిటి బూసుకొని నను నెన్నిభూషణములు బెట్టికొనిన నాశ