పుట:Bala Neethi.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
60

బా ల నీ తి.

పరోపకారము.

    ఇతరులకు మేలుజేయుట పరోపకారమనబడు.
  పరోపకారము జేయువారల బరోపకారులని పలికెదరు. ఈపరోపకారులు తాము కష్టముల ననుభవించుచుండినను దీనులయొక్క బాధలబోగొట్టి వారికి సౌఖ్యము జేకూర్చుచుందురు. వృక్షములు నిండువేసవిని దామాఖరకరకిరణములచే గ్రాగుచున్న మిడిమిడి యెండలో మలమల మాడుచు వచ్చిన నధికుని జేరదీసి నీడనొసంగి వానిసంతాపమునుహరించుటలేదా? సజ్జనులితరులచే దానుపకార మధికముగా నందినను వారుప్రుల్కుమాత్రముపకారము జేయుచుందురు. దుర్జను లితరులచే దాముపకారముల నెక్కువగా బొందియును దిరిగి యాయుపకారుల కపకారములనే కూర్చుచుందురు. ఱాలచే ఱువ్వినను గినియక రసాలసాలములు మనకుబండ్లనిచ్చుటయు, మరణావస్దలో నుండెడి పామునుదీసికొనివచ్చి తగిన యుపకరములొనరించి దానిపీడ దొలగించి పొలములోని దనిజకగాబెంచినను నదిమనల గఱవక విడువకుండుటయు మనకు బ్రత్యక్షంబేకదా? దుర్మార్గుడు పరులచే దాను బాధ బొందుచున్నను నితరులకు గీడొనరించు పనియందు యోచించుచుండును.మండూకము పాము నోటిలో నుండియు బ్రక్కన నీగలున్న వానిని భక్షించుటకై యత్నించునుగదా?