పుట:Bala Neethi.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
56

బా ల నీ తి.


ఆ.వె.దంతియడుగులోన♦దక్కినజంతుచ
       యంబునడుగులెల్ల♦నడగియుండు
       నట్ల ధర్మకోటు♦లన్నియులోనగు
       నిద్ధగుణయహింస♦కింతనిజము.

(భారతము.)

ధైర్యము.

ధైర్యమనగా నాపదలవలన వికారము నొందకుండ కార్యోత్సాహముకలిగియుండుట.

ఇది, మనోధైర్యమనియు, దేహబలముకలిగినందు వలన గలుగు ధైర్యమనియు రెండువిధములుండును. ఈధైర్యమొకకార్యము సాధించుటయందుగాని పౌరుషమునందుగాని యొకబలవంతునియాశ్రయము వలనగాని జనించుచుండును. ఈధైర్యము కలిగిన వారిని ధీరులని వచించెదరు. వీవలె కార్యసాధకులు. ఈధీరులు తాముదైవవశమున నొకానొకప్పుడు పలుకడగండ్లజిక్కినను వానినెంతమాత్రము లక్ష్యముంచక తమపనినే కొనసాగించుకొన యత్నిందుచుందురు. కాబట్టి ధీరులెప్పుడైన నెన్ని దు:ఖములుకలవారైన నవి యితరుల కగుపఱచ కుండ నుండును. ధీరులు వానలదడసినను, నెండల గ్రాగినను సరకుసేయక కార్యముసాధించుచుందురు.