పుట:Bala Neethi.pdf/57

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు

44

బా ల నీ తి.

లాభము, దు:ఖము, గౌరవము, మున్నగువానిని బొరయగలము. మనమితరునితో స్నేహమొనరించ దలచినయెడల ముందుగా వానికడవడి, బుద్ధి, వీనిని గమనించి యవి మంచివైమనకన్ననెక్కువసుగుణము లున్న, వానితోడ దప్పక చెలిమిచేయదగును. సమాన ముగానున్నను జేయవచ్చు తక్కువవానితో మాత్రము స్నేహము సేయగూడదు. జలము చవిటినేలలోబడిన నుప్పునీరగునటుల జెలిమిదుష్టులతో జేసిన దుర్గుణములుకలుగును. ఉదకము మంచిరేవడినేలలో బడిన మంచినీరగునట్లు చెలిమిశిష్టులతో జేసిన సద్గుణములు కలుగును.

మిక్కిలి బొక్కసముగలవాడు బీదవానితో జెలిమి జేయడు. అటులనె విద్యావంతుడు విద్యావిహీనునితో, రనశూరుడు భీరువుతో, మదారుడు లుబ్దునితో సహ వాసము జేయడు. ఇది లోకస్వాభావికము. మంచినీరు గలిగినమహానదులు నిందార్హమగు క్షారజలమునుగలిగిన సముద్రమున గలియుటవలన గదా యవికూడా క్షారజలముకలవియైనవి. అటులనే సత్పురుషులు దుర్జనులతో సహవాసము జేసిన కొలది దినముల కాకుమతులగుణములు వీరికిగూడ బట్టుబడును. కాన దుర్జనసహవాసము గర్హ్యము.

ఇక మనుజునకుసజ్జనుమిత్రత్వముతో సమాన మైనది వేఱొకటిమంచిదికానంబడదు. మఱియు దానితొసాటిగా నపశయముజేయునదియు లేదు. చూడుడు, మనము పాప