పుట:Bala Neethi.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు

43

బా ల నీ తి.

డిన గ్రమక్రమముగా జక్కగా బట్టువడును. కాని పెద్ద వారమైనతరువాత వినయమభ్యసింపవలననిన నంతగా బట్టుపడదు. "చెట్టైయొంగనిది మ్రానై యొంగునా?" కాన మనమీబాల్యదశనుండియే వినయ మభ్యసించుదము. అటుల నభ్యాసమొనర్చినయెడల సకలసంపదలు మనల జేరనపేక్షించుచుండును.

క. వినయమె కీరితినిచ్చుచు
    వినయమె పృధులాభములను♦వేగమె కూర్చున్
    వినయమెజగమున నన్నుతి
    గనుగొనగాజేయుగాన♦గె
    

సహవాసము.

సహవాసమనగా గూడియుండుట. అనగా నొకని తో నొకడు కలిసియుండుటయే.

ఈసహవాసమువలన గీర్తియు, నపకీర్తియు, లాభము, నష్టము, మంచి, చెడు, కష్టము, గౌరవము, పరిభవము. మొదలగునవన్నియు సంప్రాప్తించు. మనమెటువంటివారలతో సహవాసము జేసిన నట్టిగుణము లలవడును. అనగా మనము దుర్జనులతో సహవాసముజేసినయెడల నపకీర్తియు, నష్టము, గష్టము, నవమానములోనగు చెడుగుణ ములు కలుగును. ఇక సజ్జనులతో సహవాసమొనర్చిన గీర్తియు