పుట:Bala Neethi.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
40

బా ల నీ తి.

తలచుదురు. కానియదివట్టిభ్రమయనినమ్ముడు. దుర్జనుడు వినయరహితుడై కన్నులబైకిజూచుచుండును. సజ్జనుడు సుగుణములచే నిండుకొనియున్నను దలనువాంచి వినయముగా జొక్చుచుండును. లోకమున గొమ్మలులేనిమ్రోడునభమువంకజూచుటయు, సుమనోమనోజ్ఞంబులగు ఫలసుమాదులనిండుకొనియున్నతరువు తమశాఖల నొంచికొనియుండుటయు మనమీక్షించుటలేదా? కాబట్టి యటులనుండుట స్వాభావికమే. తానుధనవంతుడైనను విద్యావంతుడైనను దరిద్రునిగాని విద్యావిహీనునిగాని చూచి నవ్వకూడదు. నవ్వినయెడల వారునింకొకపరి మనలజూచి రెట్టింపుగానవ్వగలరని తెలిసికొనుడు.మూరెడుపెరిగిబరెడు క్రుంగుటయేల! మిత్రులారా! “అత్యుచ్చ్రయ:పతనహేతు:” అనగా “నెక్కువపెఱుగుట విఱుగుటకొఱకె“ యనివినలేదా? కాననేదైన నెప్పటికైనను నిక్కియుండుట మంచిదికాదు. లోకమున మానవులువినయమునజెప్పుమాటలవినుచుందురుగాని భయమున వచించుమాటలు వినుచుందురా? వినరు. ఆవుయొక్క పొదుగును దిన్నగా బితికినయెడల బాలిచ్చునుకాని దానినిగోసివేసిన బాలివ్వగలదా? ఈయదు. కానవినయపూర్వకవచనములు విరోధిసాధనభూతములు ఈవిషయమేసర్వత్రసాధకము. వినయములేక పెద్దలనవమానించినవారలు కష్టములబొందగలరు. తనకిదివఱకున్నకీర్తియు గూడబోవును.