పుట:Bala Neethi.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


33

బా ల నీ తి.

జు సహించెను. అంతనానక్షత్రకు డారాజుయొక్క భార్యనమ్మించెను. మఱియు నారాజునుకూడ నమ్మెను. చక్రవర్తియగునీహరిచ్చంద్రుని కాటి కాపలివానికి గొలువుగానిగా జేసెను. ఆనక్షత్రకుడనేకవిధముల నీరాజున కసత్యమాడుమనిబోధించెను. అది నిష్ఫలమాయెను. తుదకారాజుచేతనే యతనిభార్యను లేనిపోని నెపములబెట్టి చంపింప సమకట్టెను. అతడు తనయజమానుని యాజ్ఞానుసారముగా దనభార్యయని తలచక ఖడ్గము చేగొని యావధ కార్యము నెఱవేర్పబోవుతఱి విశ్వామిత్రుడు వచ్చి “హరిచ్చంద్రా! ఊరుకొనుము. నీవొక యసత్యమాడిన నీకష్టములన్నియు నీక్షణముననేనాపగల“ ననిచెప్పెను. దానికారాజు “స్వామీ! సంతసించితి. మీరనినపగిది నేనసత్యమాడదలంచిన యెడల నిన్నికష్టముల ననుభవించ కుండెడివాడను. నేనాయనృతదోషమున కొడిగట్టలేకయే యిట్టి యిక్కటుల బొందుచుంటిని. కాన దయచేసి యిచటనుండి వెడలుడని చెప్పి తిరిగి తత్ప్రయత్నమాచరించుచుండ బ్రహ్మవిష్ణుమహేశ్వరులు యాపనినాపి “నీసత్య వ్రతమునకు మెచ్చితిమిగాన వరములు గోరు, మని పలికిరి. అంతట నామూగురుమూర్తులు వారుకోరినవరములిచ్చి కుమారునిబ్రతికించి తిరోధానమైరి. అంత విశ్వామిత్రుడు కూడ నాతనిదృఢసత్యవ్రతమునకు మెచ్చుకొని యిదివఱకు బంతమున వచించినాగిది తనతపమునం దర్దభాగఫలము ధారవోసి యా