పుట:Bala Neethi.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

23

బా ల నీ తి.

స్తుతము మనలను సుఖముగా బరిపాలించెడి రాజులయందు భక్తిగానుండి ఫలములబొందుటకు బ్రయత్నముఛేయుదము.

క. జనులకు నెల్లనుబూజ్యుడు
    జననాయకుడతనిమహిత ♦శాసనమునప్ర
    జ్ఞనులును మునులును సద్విధి
    జనువారలుకాని కడవ జనగాదెపుడున్

భారతము

విద్య.

     విధ్యయనలోకములోనిసమస్తవస్తుగుణస్వభావాదుల దెలిసికొనుట.
      ఈవిద్యయనునది లేనిదే మనుజు దభివృద్ధికి రానేరడు. ఇది కాఱు క్రమ్ముకొన్న చీకటుల ధ్వంసము జెయు సూర్యునిపగిది విరాజిల్లుచుండును. విజ్ఞానమొదవించుచుండును. అపకీర్తి హరించుచుండును., సత్కీర్తి వృద్దిజెందించు చుండును. ఇది మంచి,ఇదిచెడ్డ, యిదిన్యాయ, మిదియన్యాయమను సంగతుల నీవిద్యవలన దెలిసికొనవచ్చును. పరోపకారాది బుద్దులలవడును. నిరామయసౌఖ్యములు చేకూరుచుండును. ఇంకను నీవిద్యను ధనముతో బోల్పదగును. కొన్నికొన్ని కారణములచే నాధనముకన్న నీవిద్యాధనమే యధికమని చెప్ప