పుట:Bala Neethi.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
22

బా ల నీ తి.

చెప్పినదంతయు సత్యమేకాని నన్ను సూతపుత్రుడని నిర్లక్ష్యముచేయక చేరదీసి తనయనుజులకన్న నెక్కుడుప్రేమతో గౌరవించి నేగొరినవానినన్నిటిని దెచ్చియిచ్చి, మన:ప్రమొదంబొనరించుచు నన్ను దనయతవానిగా జేసిన యారాజరాజును విడిచివచ్చుట నీతిబాహ్యమని నీవెఱుగనిదే? నేనాలాభములకై యాసపడను. తుదకు నాప్రాణములనై నగోల్ఫోవుదు గాని రాజద్రోహినిమాత్రము కాజాలనని చెప్పి యారాయబారిని బంపివేసెను. అటుతరువాత గుంతి, "రాధాపుత్రు" డనియనుపించుకొనుచున్న తనపుత్రుడేకాంతముగా భాగీరధీతీరముననుండుట కనుగొని యించుకంత భేదముగా బైవిధముననే బోధ జేసెను. అంతట గర్ణుడు "అమ్మా! నీకొమరుండనైనను జిన్ననాటనుండి వారియన్నముదినివృద్దికివచ్చిన నేను వారిని విడువజాలను. మిమ్ములచేర" నని దృడముగా జెప్పెను. అంత గుంతీదేవికొన్ని విషయము లాకర్ణునడిగెను. వానికి గర్ణుడుత్తరములనొసంగి యీమెను వీడ్కొలిపెను.

     కనుగొంటిరా? పాండవులగలసిన ననేక లాభముల బొందగలనని యాకర్ణుడు తెలిసికొనియు రాజభక్తిరతుడై యాలాభముల దృణములుగా భావించి కలియక యుయండెను. అది యెంతనిశ్చలమైనరాజభక్తియో కంటిరా.  కావుననే యాకర్ణుడు రాజరాజుచే ననెక ఫలముల నందగలిగెను. కానబ్ర