పుట:Bala Neethi.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
18

బా ల నీ తి.

  రాజున నెవరన మంచికొలమునబుట్టినవాడును, శౌర్యముగలవాడును, నీతిశాస్త్రవిశారధుడును, ప్రభుమంత్రోత్సాహ శక్తిసంపన్నుడును, ధీరులును, సకలశాస్త్రసంపన్నులును, ధర్మతత్వజ్ఞలునగుపండితులును, ప్రభుహితాభిలాషులును, పద సద్విమర్శనజ్ఞానముకలవాడును, రాజనీతిపరులునునగు మంత్రివర్యులను నిరుపమానంబగు పరాక్రమముని నిశ్చలమగుపట్టుదలయు గలిగినభటవర్యులను గలిగినవాడు రాజని పల్కనగు.
       ఈరాజు, తనరాష్ట్రములో, గురువైనను దుర్మార్గుడై ముందు వెనుకలు విచారించక యితరులకపకారముల జేయుచుండినయెడల వానిని బ్రకటనముగా జక్కగాశిక్షించును. దూరాలోచనగలిగిన మంచిమంత్రులతోడ నేకాంతమున మంతనం బొనరించి పనులనారంభించి యడ్డుపాట్లురాకుండ దనపనుల గొనసాగించుకొనుచుండును. జనులకు, మంచికొలమును, మంచిబుద్దియును, మొదలగుసద్గుణములకెల్ల నీరాజేకారణము. రాజు దైవముతోసమానుడు. కావుననే నావిష్ణు:పృధివీ పతిన్, అనగా "రాజైనమనుజుడు విష్ణు" వని మనయుద్గ్రందము లన్నియు నొక్కపెట్టున బల్కుచున్నవి. మన మారాజు సాహాయ్యము లేనిదే యేపనిని జేయజాలము. మనధనము గాని ధాన్యముగాని దేనికైన నారాజుయొక్క తోడుపాటులేనిదే నిలుపుకొన జాలము. చూడుడు, మనము భూమిని దున్ని విత్తనములజల్లి నవి మొలకలత్తి క్రమక్రమముగా