పుట:Bala Neethi.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
14

బా ల నీ తి

నగ్గురిశిక్షబొందక చిన్నతనమును వ్యర్దముగా గడపినయెడల వానికి లెక్కలేని చెడుగుణము లలవడును. పొట్లతీగ లయందు దగులుకొనియున్న చిన్నకాయలతుంతురు. ఱాలను గట్టనియెడల నవి వంకరలు పోక యెటులుండును. కాపరిమంచక గొఱ్ఱెలయలనుంచిన నవి వంకరత్రోవలబడక యెటుల చక్కగాబోవును? కాబట్టి గురు శిక్షబొందనివారలు విశేషవక్రమార్గముల జొరబడుదురు. కానబ్రతివాడును గురుశిక్ష బొందవలెను. విద్యనెక్కువగా గడించవలెను.

    తాము బాల్యమున నొకగురువువద్ద విద్యనభ్యసించి క్రమక్రమముగానతినియెడ ద్వేషమువహించి "నీకు మేము శిష్యులముకాము. నీవు మాకు జెప్పినదేదియునులేదు" అని యా గురువుతో గ్రుద్దులాడి యాయనకు బంగనామమిడి యతని దిరస్కరించుట నరక హేతువు.ఇటులొనర్చువారలవినీతులు కాన బ్రతివాడును గురువునం దెక్కువ భక్తి కలిగియుండవలెను. గురువేఋబ్రహ్మ, గురువేవిష్ణువు, గురువేమహేశ్వరుడని మన పెద్దలు చెప్పుదురు. అటులనే "ఆచార్యదేవోభవ"అనగా గురువేదైవ ముకలవాడవైకమ్మా' యని యుపనిషత్తులనుచున్నవి. కాన మనము గురుభక్తికలిగియుండినయెడల ననేక ప్రయోజనములు నందగలము.
  అటులం బ్రయోజనములందినవారలలో నొకనిం జెప్పెద.