పుట:Bala Neethi.pdf/26

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు

13

బా ల నీ తి.


గురుభక్తి.

అజ్ఞానమునరికట్టువాడు. శ్రేష్టుడు, తనకువిద్య, జెప్పిన వాడు, వీరలయందుభక్తిగానుండుటయే గురుభక్తియన బడు.

మనల ముందబివృద్దికిదీసికొనివచ్చునదియు, భక్తి భుక్తి శ క్త ముక్తుల నొసంగునదియు, గౌరవార్హ మును నగు విద్యను నిష్కపటముగా జెప్పినవారలు గురువులు కాన వారియందు మనము భక్తిగానుండ వలెను. ఆవిద్యాదాతలను మనజీవితాంతమువఱకు గౌరవించుచుండవలెను. గురువుగూడ మన తలిదండ్రు లతో సమానుడని చెప్పచెప్పు. ఏలయన? మన జననీ జనకులు శరీరపోషణాదులయందెక్కు వశ్రద్ధవహించు చుందురు. ఇక గురువులన్ననో మనల నితరులచే గౌరవింపజేయువిద్య నఱమఱలేక యఱిముఱిగా నొసంగుచుందురు. అటులనుండుట వలన వారు మనకు గౌరవస్ధానమేకదా. వారు మనము విద్వాంసు లగుటకు గోరుచుందురు. మనకుశలమును వారభిల షించుచుందురు. కాబట్టి మనమారంబదశనుండి గురుశిక్ష బొందవలెను. దానివలన మనము విద్య లెస్సగానేర్చి విద్వాంసులమై లోకమున నెడదెగనికీర్తి గడింపగలుగుదుము. ఈయవనియందుద్భవించిన ప్రతిమనుజుడును జిన్నతనముననే గురుశిక్షనొందిన యెడల వాడనేక లాభముల బొందగలడు.