పుట:Bala Neethi.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
2]

9

బా ల నీ తి.

విడిపింపు“ డని. పలికెను. అవ్విధముననే వారొనరించిరి.

చూచితిరా!అనిహంగేంద్రుడు మహాబలజవోపేతుడయ్యుదల్లిమాట నిరాకరించలేక పాములమోసెనుగదా. మఱియు దనతల్లిబానిసపని బాపుటకై యెంతపని జేసెనో తెలిసినదిగదా. ఈసమయముననేకదా విష్ణుమూర్తివలన వరములబొందుటయు నింద్రునితోసఖ్యంబు సంభవించుటయు మాతృభక్తివలన నాకస్మికముగావచ్చినలాభములేకదా. కాబట్టి మాతౄభక్తిగలిగినవారలు మహాసంపన్నులుకాగలరు. కాన మనము మాతృభక్తికలిగియుండుదము.

ఆ.వె. వచ్చిపోయి చూచు♦వాడుగాకిడుమల
      బడునె? తల్లివోలె♦బట్టితోడ
      దండ్రిచెప్పునిట్లు♦ధర్మశాస్త్రంబుల
      నంబ గౌరవమున♦నధికయగుట.

         

భారతము

పితృభక్తి.

తండ్రియందు భక్తిగానుండుట పితృభక్తియనబడు.

కన్నతండ్రి మనలబెంచిపెద్దజేయుచు మనకుగావలసిన యాహారవిహార పదార్దములదెచ్చియుచ్చును. మనతోగూడ నాడుచు మాటలాడుచు మనకానందము గూర్చుచుండును. మనతోడనే సంతోషముగాగోల