పుట:Bala Neethi.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
8

బా ల నీ తి.

వేగముతో వచ్చుచుండెను. ఇంతలో విష్ణుమూర్తి కనుగొని "నీవేగపద్భుద్దులకును, నీబలమునకును, నీమాతృభక్తికిని మెచ్చితి గాన నీకు గావలయువరము లెవ్వియో కోరు" మని పలిక. అంత నావైనతేయుడు "భక్తవత్సలా! నేనమృతంబుద్రాగకపోయినను ముసలితనములేని దేవత్వమును, నీభువనముల కెల్లను నాయకుడవైన నిన్ను నెల్లప్పుడు గొలిచి యుండుటను నాకుదయచేసి యనుగ్రహించుండని ప్రార్దించెను. అంత నామహామహు "డటులనె నీకోరిక లిచ్చితి. మఱియు నీదినమునుండి నాకుధ్వజమును వాహనంబును, నీవెకావయునని చెప్పెను. దానికా గరుత్మంతుడు డంగీకరించి సంతసించెను. ఇంతలో దేవేంద్రుడు "అమృతమునువీడుహరించెగా" యని కినిసి యాగరుడునిపై వజ్రాయుధముం గాంచి "వజ్రాయుధమా! గొప్పవాడగు దేవేంద్రునికరమున నుండు దానవు. కాన నిన్నవమానింపగూడ" దని పలికి తనఱెక్కయందున నొకయణుమాత్రము దానికాహారముగా జూపి నీపనిని జేసికొని పొమ్మని పలికెను. ఇవ్విధమున నీగరుత్మంతుడు డొనర్చుట సుర్వేశ్వరుడు చూచి మెచ్చి యాతనితో స్నేహము జేసికొనెను. అటుపిమ్మట నావిహంగపతి కాద్రవేయుల సమీపమునకువచ్చి "ఇదిగో మీరుకోరినటుల నమృతముదెచ్చినాను. గొనుడు. నాతల్లిని దాస్యమునుండి