పుట:Bala Neethi.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7

బా ల నీ తి.

వీపుననుండి యొకపరి యవిక్రిందపడుట కద్రువకాంచె. అంత నామె యత్యంతముగా నాగురుడుని దూఱెను. అంత నాతడు తనతల్లిని "అమ్మా! మీసవతి యొక్కయు, నామెకుమారులయొక్కయు బనులనెందులకు జేయవలెనని యడిగెను. అంత నావినత నాయనా! నానవతియునేనునుచ్చైశ్శ్రవంబు బరీక్షించునపుడు దానిపుచ్చంబున నలుపులేదని నేనును, గలదనియాయెయూ వాదమొనరించితిమి. ఈవాదమున నెవరోటుఒపడుదురో వారవతలివారికి దాసిగానుండవలెనని యొక పంతమేర్పఱచుకొంటిమి. మఱునాడు దానిని బరిశీలింప నేనోటువడితిని. దాన నామెకు దాసిగా నింతచఱకు నుంటిని. దీనికి గారణము మీయన్నగారగుననూరునిశాపమే ఇక నీబానిసపని నీవలన బాయదగు"నని పలికెను. అంత నతడు తన తల్లియొక్క నీచపుదశగనుగొని వంతనంది యా వరవుడముం బాపుటకై యాసవతితల్లికొమరులదరి జేరను. తరువాత, వారిని "నాతల్లిదాస్యము మీరు బాపినయెడల మీకిష్టమైనది యేదైనను దెచ్చియిచ్చెద" నని యడిగెను. అంతవారు "మాకమృతంబుదెచ్చియిచ్చిన నీతల్లి దాస్యము పాయగల"దని యనిరి. దానికి గరుడుడు సమ్మతించి తన తల్లియనుమతిని గైకొని మార్గమధ్యమున ననేక దుష్కరకార్యముల జేయుచు నాకలోకంబు జేరెను. అచట నమృతమునుగాచుచు గావలియున్న వారితో యుద్ధమొనరించి యాయమృతమును గైకొని తానుద్రాగకుండ నత్య్భతడు