పుట:Bala Neethi.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
160

బా ల నీ తి.

వెడలినవి. దాననెకదా తెలుగుబాసకదియె వర్దమానదశ యని వాకొనుచుండిరి. మఱియు నామహారాజాముక్త మాల్యదయను గ్రంధరత్నమును రచించి బైలుదేఱదీ యుటవలనెనకదా యితరులకుగూడ నాంధ్రగ్రంధము లం దభిరుచి కల్గుచున్నది. ఇటులననేకవిధముల దెలుగు నబివృద్దిజేయుటవలననేకదా యాకృష్ణదేవరా యలను గీర్తించుచున్నారు. కానమందఱము మనమాతృబాషయగు తెలుగునమదభిమానము కలిగి యుండవలెను. మనమాంధ్రమును జక్కగా జదివి విద్వాంసులముకావలయును. అటుతరువాత నిస్సార మగు గ్రామ్యభాషను గ్రంధములరచించక హృదయంగ మమగు గ్రాంధికభాషయందె మంచికబ్బముల రచించి యాంధ్రలోకసన్నుతికి బాత్రులమగుటకు బ్రయత్నింతము.

క. ఆయాదేశమువారికి
   నాయాదేశంబుభాష♦నమరినకావ్యం
   బాయుతపురుషార్దంబుల
   బాయక సమకూర్చు దేవ♦భాషయు బోలెన్

(అప్పకవీయం)

ఓం తత్సరత్

శ్రీ చివుకుల అప్పయ్యశాస్త్రి ప్రణీతంబగు
  బాలనీతియను గ్రంధము సమాప్తము.

శ్రీ. శ్రీ. శ్రీ.