పుట:Bala Neethi.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
(20)

153

బా ల నీ తి.

షయమీమహాకవికి దెలిసిన ట్లింకొకరికి దెలియదు. కాబట్టియె యీకవి మహాపండితులచే గవిబ్రహ్మ" యని గౌరాలాంచనము నందగలిగెను. ఈకవి నియోగియైనను వేదాధ్యయనసంపన్నుండయి యజ్ఞమొనరించినవాడు. ఈకవి సమకాలికుడగు కేతనచే దశకుమారచరిత ము ను గృతినందెను. ఈమహాకవివలన భారతము సంపూర్ణముగ నాంధ్రీకృతమయ్యెను. కాని కొలదికాలమై న తరువాత నాదికవిచేరచింపబడిన భారతారణ్య పర్వమున గొంతశిధిలమైపోయినది. అందువలన బూర్తికాలేద్.

    ఈతిక్కనకు దరువాత హూ ళ 14వ శతాబ్దమందు న "నెఱ్ఱాప్రగడ"యను మహాకవి శిధిలమైన యాయరణ్యపర్వశేషమును నన్నయకృతముగానె పూర్తిజేసెను. ఈకవి నియోగి. ఈతనితల్లి పోతమ్మ, తండ్రిసూరన్న, ఈతనిది శ్రీవత్సగోత్రము, ఇతడు సంస్కృతాంద్ర పండితుడు. ఈతని కవిత్వము నన్నయతిక్కనల కవనమువలె నుండును. ఈతదు శివభక్తుడగుటవలన శంభుదాసు డనియు బ్రబంధశైలిని భారతమున నరణ్యపర్వశేష మును బూర్తిజేసెను. కానబ్రబందపరమేశరుడనియు నామాంతరములు కలవాడు.  ఈకవి,హరివంశము, రామాయణము, నృసింహపురాణమును నాంధ్రీకరించె ను. ఈమూడు నృసింహపురాణ మహొబలస్వామి కంకితముసేసియున్నవాడు. శ్రీమదాంధ్రభారత మీ మువ్వురు రచించుటంబట్టి వీరికి గవిత్రయమని పేరిడిరి.