పుట:Bala Neethi.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
150

బా ల నీ తి.

లదుగాని భాషకుగానరాదు. మనదేశమునందు మొదట కొంతకాలమువరకు సంస్కృతద్రావిడకర్ణాట భాషలు మిక్కిలి ప్రచారము కవియై యున్నవి. ఆ భాషలయందు లెక్కలేని కబ్బములు బయలువెడలినవి. గొప్పగొప్ప పండితులున్నారు. కాని మన తెలుగుబాస మిక్కిలి ప్రచారములేక పోవుటయు కాక దానియందొకపొత్తమైనను బయలువెడలక నియమరహితమై వంకరభాషయై యుండెను. దానినె జనులు మాటలాడుకొనుచుండిరి.

     ఇట్టితరుణముఇన నాపస్తంబసూత్రుడును, ముర్గలతోత్రజాతుడును, వైదికశిఖామణియునగు నన్నయభట్టు జనించి యిదివఱకబివేద్ధిదశలోనున్న స్సంస్కృత పంచకావ్యంబులను, నాటకంబులను, వ్యాకరణశాస్త్రములును, చందశ్శాస్త్రంబును జక్కగా బఠించి పిమ్మట ద్రావిడభాషను బ్రాకృతభాషను బాగుగాజదివి విద్వాంసుడై లోకజ్ఞానమలవరించు కొనుచు నెగడుచుండెను. ఇటుల నెగడుచుండు నన్నయఃభట్టును 111.వ సంవ్చత్సరమున రాహ్యము సుఖముగాబరిపాలించు రాజరాజనరేంద్రుడు తన యాస్దానమునకు బిలిపించుకొని సగౌరవముగా నిటుల బల్కెను. "పండితవరా!నేనుభారతంబును ఇనుట కెక్కువయిష్టపడుచున్నాను. కాన నీవు సంస్కృతముననుండు భారతమును సలక్షణముగా నాంధ్రీకరించి నన్ను గృతర్దుజేయు" మని ప్రార్దించెను. అంతనన్నయభట్టు తానదివఱకె సంస్కృత ద్రావిడ కర్ణాటభాషాపండితుడై నందువలన నామ