పుట:Bala Neethi.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

149

బా ల నీ తి.

ర్గ్రంధముల రచించి నద్యకమార్జించుట కెక్కువగా బ్రయత్నింతము.

ఆ.వె. ఎల్లభాషలకును♦దల్లి యిల్ల యినట్టి
        సంస్కృతంబు మనము♦చదువవలయు
        జదివి దానిమహిమ♦జాటించవలయును
        జాటి దాని వృద్ధి♦సలుపవలయును.

ఆం ధ్ర భా ష.

       మన తెలుగు బాసనెయాంద్రభాషయనియెదరు.
   మన తెలుగు బాసకీయాంధ్రసంజ్ఞ యెటుల గలిగినదన. మగధదేశమును బరిపాలించు, ఆంధ్ర నామకప్రభువు మనపూర్వులు నివశించుదేశమును జయించి పరిపాలించుటంబట్టి మనదేశమునకును, మనబాసకు నాంధ్రసంజ్ఞకలిగినది. అప్పటినుండి యిప్పటివరకు మనదేశమాంద్రదేశమనియు, మనబాస నాంధ్రభాషయనియు వ్యవహరించుచు న్నారు. 
  ఈభాష స్వతంత్రభాష కాదు. ఈభాష సంస్కృతము, ప్రాకృతము, ద్రావిడము,కర్నాటమను నాలుగుబాసల  తో గూడికొనియున్నది. సంస్కృత ప్రాకృతభవపద ములు తప్ప ద్రావిడ కర్ణాటటపదములన్నింటిని దేశ్యములని మనవారు వాడుచున్నారు. మనదేశమునకు వేగియను నామాంతరము క