పుట:Bala Neethi.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
152

బా ల నీ తి.

ని రచించెనని కొందఱు ధీవరులనెదరు. కాని యది చింత్యము. ఈయాదికవి బుద్ధియందు బృహస్పతితో సమానుడు. నిగర్వి, పరోపకారి, కృతజ్ఞడునై యున్నవాడు. ఈకవి యాంధ్రమునుసలక్షణముగా నొనరించుటవలన విద్వాంసులచే "వాగనుశాసను"డని బిరురమునందెను. కొందఱీతనిని నియోగియనెదరు. కాని వైదికుడని తెలిసికొనుడు.

    ఈకవికి దరువాత హూణశకము 12వ శతాబ్ద మందున దిక్కనయనుమహాకవి కొమ్మనపుత్రుడై యుభయకవిమిత్రుడై నియోగిశిఖామణియై ప్రసిద్ది గాంచుచుండెను. అంతనొకసమయమున నదివఱకు నన్నయచే గొంతవఱకు రచింపబడి మూలబడియున్న భారతమునుగాంచెను. అంతటనాభారతమును బూరితి జేయవలయునని తనకుబుద్దివొడమెను. అటుతరు వాత హరిహరనాధుని గృతినేతగా నొనరించివిరాటపర్వా ది పంచదశపర్వములను, బహుశ్రద్ధతో సరసముగా నాంధ్రీకరించి వానినిబూరితిజేసెను. ఈకవి, యీభారతమును బూరితిజేయకమున్నె మనుమ భూపాలుని గృతినాయకుని గా నొనరించి నిర్ఫచనోత్త ర రామాయణమును రచించెను. ఈతనికవిత్వము మూడుపాళ్ళ తెలుగుపదములును, నొకపాలు సంస్కృతపదములును గలిగి ద్రాక్షపాకమైదీర్ఘసమాస ములులేనిదై నానాలంకారశోభితమైనళమైమనోజ్ఞము గా నుండును. ఎట్టిపట్టుల నెట్టిపదముల బెట్టి యారస ముట్టిపడునటుల జేయవలయునో యావి