పుట:Bala Neethi.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

147

బా ల నీ తి.

హారాజుతో "వల్లె" యని యింటికిజనెను. అటుపిమ్మట దనకిష్టుడును, నరీర్దుడును, సంస్కృతద్రావిడకర్ణాట భాషాపండితుడునగు నారాయణభట్టుచే నాంధ్రభాషకు సంబందముకలిగిన కన్నడమునందక్కడక్కడ చందోవిషయమున సాహాయ్యమందుచు నదివఱకు గక్కిరిబిక్కిరిగానున్న యాంధ్రమును సంస్కరించుచు బద్య గద్య యుక్తముగా నూతనముగా నారాజనరేంద్రుని గృతిపతినిజేసి వ్యాసరచిత భారత మాంద్రీకరించ మోలిడెను. క్రమముగానాతడాభారతము నందాదినభారణ్యపర్వములను రచించెను. అంతటనా నన్నయభట్టుతనయభీష్టమును దురివఱకు గొనసాగ నీయని దైవవశమున విధివశు డాయెను.ఈతనికవ నము, రెండువంతులు సాంస్కృతికపదములను, నొకవంతు తెఱుగునపదములును, గతిగిలహుసరస ముగాననేకలంకారశోబితమై దూరాన్వయములు లేక యొప్పుచుండును. మన తెలుగు బాసలోనికి నితడె మొదటికవి. ఈనన్నయభట్టాదికవికాడని కొందఱనె దరు. కాని ఈతనికిబూర్వమువలె యని వాడుచున్నారు. కానియీపొత్తముల బయలుదేఱదీసి యవి నన్నయకుబూర్వములె యని వాడుచు న్నారు. కాని యీపొత్తములన్నియు నారయ నిటీవలి వె యగుచున్నవి. కాన నన్నయ యాదికవియని చెప్పనొప్పు. ఈయాంధ్రకవితాపిత, యాంధ్రశబ్ద చింతామణియను లక్షణగ్రంధమొకదాని