పుట:Bala Neethi.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
118

బా ల నీ తి.

తిరి కలలోనగుపడి గుండెలుజల్లుమనిపించెడివికరాకార ముగలిగినవాడు. మాయాయుద్ధము తెలిసినవాడును, నగురాక్షసులతో యుద్ధమొనరించి వారినందఱినిర్జజెండి చెకపికలాడిరి, అంతట నీవానరు లసాధ్యంబగు నా శ్రీరామకార్యము ను నెఱవేర్చి కృతార్దతగాంచిరి.

   కనుగొంటిరా! ఆవానరులు కొంచెపుబలము కలవారైనను వేలకొలది యొకటిగా జేరుటవలనగదా యగాధంబగునబ్ధికి మహత్తరంబగునొకవంతెనవేసి దాని వలన లంకాపట్టణముజొచ్చినది. మఱియు నీయైక మత్యము వలననెకదా యావానరులు పటిష్ఠులగు నారక్కసులను గొట్టి కోలాహలముజేసి శ్రీరామకార్యము నెఱవేర్చి కృతార్దతగాంచగలిగినది. కాబట్టి మనయైక మత్యముకలిగి గొప్పగొప్పపనులజేసి  గొప్పవారలచేత మెప్పుంబొందుచుందము.

తే.గీ. బలముగలవాని బలువురు♦బలహీను
       లొక్కటైకూడి నిర్జింతు♦రుత్సహించి
       మధువుగొన నుత్సహించిన♦మనుజు బట్టి
       కట్టి నిర్జించు మధుకర♦కులమునట్లు.

(భారతము.)