పుట:Bala Neethi.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
114

బా ల నీ తి.

జేరకపోయినను బ్రీతిగా జూచుచుందురని యనుకొందమన్నను నదియులేదు. కాన దరిద్రుడు జీవించి యుండుటయు బ్రయోజనము లేదు. "నిర్దనస్తు మృతస్సమ" యని వినమో కావున మంచి మార్గమున నత్యాశవిడనాడి ధనమార్జించవలయును.

   ఈధనమును దుష్కార్యములకు వినియొగించక తాను జక్కగా ననుభవించి మిగిలినదానిని లోకోపకార కార్యముల కుపయోగించు చుండవలెను. అంతియకాని ప్రభువులు తక్క దక్కినవారలు విశేషముగా డబ్బు నిలువనుంచ గూడదు. ఎందువలన నన? ఎపుడు ధనమును ధనమును నిలువనుంచ దలచితిమో యపుడె దానిని భద్రముగా దాచి పెట్టవలయును. గదా. ఆదాచిపెట్టుటయందు గొంచె మశ్రద్ధ వహించితిమా యది మ్రుచ్చులచృఏతుల జిక్కును. దానివలన నితరములగుపనులు పటాపంచలైపోవును. వెండియు కొంచెము డబ్బు నిలువయునదని యొక మయసూయాపరుడు వినెనా వాడు వెంటనే దాని నపహరింప మాయోపాయంకుల బన్నుచుండును. కాన విశేషముగా డబ్బుదాచుట సామాన్యుల కనర్దదాయకమని చెప్పవచ్చును. కొందఱు కులక్రమా గతధనము నిలువయున్నను నష్టములేదని చెప్పిరి. కాఇ ప్రభువులకు దక్క దక్కినవారల లాపత్కరమని యె తోచెడిది.
   ఈధనవంతులు, వివేకులైముఖస్తుతులకు లొంగక యుక్తాయుక్తవిచక్షణదక్షులై తమధనము నుపయోగించుచు గీర్తినిగాంచుచుండవలెను.