పుట:Bala Neethi.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
15]

113

బా ల నీ తి.

ఇదియె యైహికాముష్మిక ఫలసాధనము. ఇదియె యుపయోగరీతిని గీర్త్యపకీర్తి సాధకంబు, ఇదియే యనేకుల నువ్విళ్లూరింగిచుండును. ఇదియె సోదరులనువిబాగులునుగా జేయును. ఇదియె జుట్టులు జుట్టులు పట్టుకొనుటకు బురికొల్పుచుండును. ఇదియ గొప్పవారలతోడ స్నేహమొనరించును. కాబట్టియె మనవారలు "సర్వేగుణాకాంచన మాశ్రయంత్తి". అనగా "సకలగుణములు బంగారము నాశ్రయించుచున్న"వని చెప్పిరి. ఎవనికి బొక్కస మెక్కువగా నుండునో వాడే బుద్ధిమంతుడు. వాడే పండితప్రకాండుడు. వాడే గునగ్రహెణదక్షుడు. వాడె దర్శనీయుడనగుచున్నాడు. ఆధనవంతుడు కొలదిగా నొకప్పుడొక మంచికార్యమును జేసినయెడల దానిని యనేకులు వారినిజేరి వందిమాగధుల వలె స్త్రొత్రము జెయుచుందురు. ధనహీను డెంత విద్యావంతుడైనను మతిమంతుడైనను సజ్జన సజ్జన సహాయమువలన నెటువంటి మంచికార్యములు జేసినను వాని నితరులు నుతించకపోవుటయేకాక యేవగించుకొను చొందురు. పాడిగలిగిన బఱ్ఱెను జక్కగా జూచి దానికి గడ్దిమొదలగు వానిని బెట్టినటుల బాడిలేని పశువును జూచుచున్నారా? చూచుటలేదు. బెల్ల మెక్కువగా నెక్కడ నుండునో యక్కడనే యీగలు చీమలు చేరునుగాని రిత్తచోటుల నవి గుమిగూడునా? కూడవ్చు.అటులనే ధనమెచట నుండునో యచటికి జనులేగుదురు. కాని దారిద్ర్య వంతునిజేరుదురా? చేరరు. దారిద్ర్యము గలవానిని