పుట:Bala Neethi.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
112

బా ల నీ తి.

లనిర్వాచ్యములునుదుగ్గమములు నగుచున్నవి. కాబట్టి యట్టి నికృష్టకష్టముల కునికిపట్టగు నీదారిద్ర్యమును బలు తెఱగులబొగొట్టుకొనుచు బ్రతివాడును ధనమును సంపాదింప గడంగవల యును.

ఈధనమార్జించుటకు మూడుమార్గములు కలవు.

   చక్కగా నొకవిద్యయందు బాండిత్యము సంపాదించి వివేకియై దానిని బ్రాజ్ఞలసమక్షమున దెలియబఱచి వారిచే ధనాదులను మెప్పుగా బడయుట. ఇది మొదటిగతి. ఇది యన్నిటిలోనికి నుత్తమము. వ్యవసాయము మొదలగువృత్తులందు గష్టించి ధనమున్ సంపాదించుట. ఇది రెండవతరగతి. ఇది మధ్యమము. ఒకరిజుట్టునకు మఱియ్హొకరిజుట్టునకు ముడిబెట్టి వారిద్ద!ఱును తగవులాడునటుల జేసి తాను వరిద్ధఱిలో నొకరితట్టుచేరి కొలదిదినములైన తరువాత రెండవవాని పక్షముగూడజేరి వానికి దగిన మాటలు వానికి వీనికి దగినమాటలు వీనికిజెప్పుచు లంచముగొట్టి సంపాదించుటయు జూదము మోసము దొంగతనము మొదలగు చెడుగుపనుల వలన నార్జించుటయు . ఇది మూడవతరగతి. ఇది యన్నిటిలొనికి నధమము
  ఈయధమవృత్తిచే సంపాదింపబడిన ద్రవ్యము నజ్జనత్యాజ్యము. కాన బ్రతిమనుజుడును పైనదెలిపిన మొదటి రెండు తరగతులవలననే ధనమార్జింప వలయు. ఈధనము పండితపామరజనసేద్యంబు. ఇదియె గర్వోద్దీపకంబు. ఇదియె