పుట:Bala Neethi.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

111

బా ల నీ తి.

ధనము.

    సంతోషము పెట్టునది, లేక, ధాన్యమువలన గలిగి నది ధనమనబడు.
    ధనము ప్రతివాని కావశ్యకము. ఇదిలేనివానిని దరిద్రుడని పలికెదరు. వీనినెవరును దగ్గఱజేరనీయరు. వీడు విద్యావంతుడైనను గణనసేయరు. ఈదరిద్రుడు వచించు మంచిమాటలుగూడ నావలద్రోసివేయు చుందురు. ఈతని కోపమితరుల నెంతమాత్రమును సాధింపనేరదు. "పేదకోపము పెదవులచే"టని విని యుండలేదా? ఈతడు మంచిపని బ్రారంబించినను జెడుపనియని చెప్పుచుందురు. ఈదరిద్రుని గని కన్నతల్లి నిందించుచుందురు. తండ్రి సంతసించడు. సొదరులితనితో మాట్లాడరు. తాను కన్నకుమారుడు తన దగ్గఱకురాడు. సేవకు లీదరిద్రుని దిరస్కరించు చుందురు. సంభాషించిన నెక్కడ డబ్బునడుగగలడో యను నెఱపుచేత నెచ్చెలులు పెడమొగము పెట్టుకొని మాట్లాడక యుందురు. ఇంతయేల? ఆదరిద్రుని భార్యయుగూడ నానిర్భాగ్యునందు  బ్రేమగా నుండదు. ఈతనితప్పు గోరంతయున్న గొండ,తజేయుచుందురు. ఈదరిద్రునిబట్టి బ్రతివాడు చెవులబట్టి యాడించుచుండును. ఈతనికెంత మాత్రము సుఖములేదు. వీడుతనజీవిత మెప్పుడు పోవునాయని యంత:కరణంబున జింతించు చుండును. చూడ జూడ నీతని కష్టము